భగవంతుని ప్రసాదం అంటే తీర్థం. దీనిలో తులసీదళం లేకుండా అది అసంపూర్ణం అవుతుందంటారు. అయితే తీర్థంలో తులసి ఆకులను ఎందుకు వేస్తారో తెలుసా?
హిందూ ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీమాతతో పాటు విష్ణుమూర్తి కూడా కొలువైవుండి, వారి ఆశీస్సులు అందిస్తారని చెబుతారు. దేవాలయాల్లో తీర్థాన్ని రాగి లేదా ఇత్తడి పాత్రలో స్వచ్ఛమైననీటిని తీసుకుని, దానికి గంగాజలం, తులసి దళాన్ని జోడించాక ఆ నీరు అమృతం వలె పవిత్రంగా, మరింత స్వచ్ఛంగా మారుతుంది.
విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణునికి తులసి చాలా ప్రియమైనది. అందుకే తీర్థంలో అందుకే తులసి దళాన్ని వేస్తారు. పంచామృతంలో కూడా తులసి దళాన్నివేస్తారు. తీర్థంలో తులసి దళాన్ని వేయడానికి ఇదే కారణం. కాగా సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా తులసి ఆకులను ముట్టకూడదంటారు.
తులసి మాతకు పరిశుభ్రత అంటే చాలా ఇష్టమనే విషయాన్ని గుర్తుంచుకోండి. తులసిని సరిగా సంరక్షించకపోతే తులసి ఆకులు ఎండిపోతాయి. మంగళ, ఆదివారాల్లో తులసి ఆకులను కోయకూడదు. హిందూమతంలో తులసికి తల్లి ప్రత్యేక స్థానం సనాతన ధర్మంలో తులసి మహిమ అపారమైనది. పూజా పాత్ర, ప్రసాదంలో తులసి దళానికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. అందుకే మంగళ, ఆదివారాల్లో తులసి ఆకులను కోయకూడదు.
ఇంకా అనేక వ్యాధులకు తులసి ఆకు నమిలితే మంచి ఔషధమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కఫం.. దగ్గు... శ్లేష్మంమొదల వ్యాధులను తులసి తగ్గిస్తుంది. అజీర్ణం చేస్తే అల్లం రసాన్ని వేడిచేసి అందులో తులసి ఆకు రసాన్ని కలుపుకొని తాగితే ఇట్టే తగ్గుతుంది. తులసి ఆధ్యాత్మికమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే దేవాలయాల్లో తీర్దంలో తప్పనిసరిగా తులసి ఆకును ఉంచుతారు.
